ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టెక్కలిలో బుద్ధుని విగ్రహానికి మరమ్మతులు - srikakulam district newsupdates

టెక్కలిలో ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత నీటి పథకం వద్ద ఉన్న పార్కులో ధ్వంసమైన గౌతమ బుద్ధుని విగ్రహానికి అధికారులు మరమ్మతులు చేయించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈ కేఆర్​వీపీ రాజుతో కలిసి డీఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Officials repairing a Buddha statue in Tekkali
బుద్ధుని విగ్రహానికి మరమ్మతులు

By

Published : Jan 4, 2021, 3:48 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత నీటి పథకం వద్ద ఉన్న పార్కులో ధ్వంసమైన గౌతమ బుద్ధుని విగ్రహాన్ని అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించారు. బుద్ధుని చేయి విరగ్గొట్టిన ఘటన వివాదాస్పదం కావటంతో పోలీసులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు మరమ్మతులు జరిపించారు.

కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి విగ్రహాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. తెదేపా నేతలు బుద్ధుని విగ్రహాన్ని పరిశీలించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరుతూ వినతిపత్రం అందజేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈ కేఆర్​వీపీ. రాజుతో కలిసి డీఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గాలికి వర్షానికి విగ్రహం చేయి విరిగినట్లు భావిస్తున్నామని.. అయినప్పటికీ ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తామని చెప్పారు.



ఇదీ చదవండి:

మన లక్ష్మీనారాయణమ్మ... భగవద్గీతనే రచించింది!

ABOUT THE AUTHOR

...view details