ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రోన్​ కెమెరాలతో నాటుసారా స్థావరాల అన్వేషణ - శ్రీకాకుళం తాజా వార్తలు

నాటుసారా స్థావరాలను గుర్తించేందుకు సెబ్ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ స్థావరాలను తెలుసుకునేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించారు. నాటుసారా విక్రయిస్తే... మహిళను కూడా అరెస్ట్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Breaking News

By

Published : Nov 13, 2020, 12:47 PM IST

నాటుసారా స్థావరాలపై పోలీసుల తో కలిపి సెబ్ అధికారులు ఈ రోజు ఉదయం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని రెల్లివీధి, వీరఘట్టం మండలంలోని గ్రామాల్లో ఈ దాడులు నిర్వహించారు. నాటుసారా స్థావరాలు తెలుసుకునేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలు వినియోగించారు. ఎస్ వి బి ఎస్ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొండ వీరఘట్టం సెబ్ అధికారులు దాడిలో పాల్గొన్నారు. వీరితో పాటు డీఎస్పీ శ్రీలత , పాలకొండలో పాల్గొని వీధిల్లో సారా అమ్మకాలపై అవగాహన కల్పించారు. నాటుసారా విక్రయించడం నేరమని అలా విక్రయిస్తే మహిళలు అని చూడకుండా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details