శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం కవిటి దగ్గర జాతీయ రహదారిపై ఒడిశా పోలీసులు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున.. ఈ చర్యలు తీసుకున్నారు. ఒడిశా భూభాగమైన బలరాంపురంలో చెక్‌పోస్ట్‌ను ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాలోకి ఎవరు ప్రవేశించకుండా తనిఖీలు చేస్తున్నారు. డీఐజీ సత్య బ్రతబోయ్, డీఎస్పీ సురేంద్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేసిన తీరును పరిశీలించారు. ఇచ్చాపురం సీఐ వినోద్ బాబుతో మాట్లాడిన డీఐజీ.. ఈ వివరాలు తెలుసుకున్నారు.
ఒడిశాలోకి ఏపీ వాహనాలు వెళ్లకుండా చెక్‌పోస్ట్‌లు - బలరాంపురంలో చెక్‌పోస్ట్‌లు
కరోనా విజృభిస్తున్నందున జాతీయ రహదారులపై పోలీసులు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున.. ఒడిశా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ రాష్ట్రంలోకి మన రాష్ట్రం నుంచి ఎవరూ వెళ్లకుండా శ్రీకాకుళం జిల్లా బలరాంపురం దగ్గర ఉన్న సరిహద్దులో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.
ఒడిశాలోకి ఏపీ వాహనాలు రాకుండా చెక్‌పోస్ట్‌లు