శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామ సమీపంలోని లక్ష్మీపురం కూడలివద్ద గుట్కా, మద్యం నిల్వలను టెక్కలి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఆటోలో రూ.95,750 విలువైన నిషేధిత గుట్కా, రూ.46,500 విలువైన 160 మద్యంసీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపారు. ఒడిశా నుంచి టెక్కలికి తరలిస్తుండగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశారు.
అక్రమంగా తరలిస్తున్న గుట్కా, మద్యం పట్టివేత - banned gutka in srikakulam
నిషేధిత గుట్కా, అక్రమ మద్యాన్ని టెక్కలి పోలీసులు పట్టుకున్నారు. దాదాపు లక్షన్నర రూపాయల విలువైన మద్యం, గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి ఏపీకి తరలిస్తుండగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు.
టెక్కలిలో గుట్కా, మద్యం స్వాధీనం