కరోనా నియంత్రణ నేపథ్యంలో.. జిల్లా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య మండలాల వారీగా...
రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బాధితుల్లో విదేశాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉంటున్నారు. ఈ వివరాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా వైద్య, పోలీసు బృందాలు సేకరించిన వివరాలతో సరిపోల్చుకొని చూస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 476 మంది వచ్చినట్లు తెలుస్తోంది. మరో వైపు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి గ్రామాలకు చేరుతున్న వారి సంఖ్యపై స్పష్టత రావడం లేదు.
ఇతర ప్రాంతాల నుంచీ ఎక్కువే...
విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు మాత్రమే సేకరించాలని ప్రభుత్వం చెబుతున్నా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పలు రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపై జిల్లా యంత్రాంగం నిఘా పెట్టింది. వలస కార్మికులు, ఇతర ఉద్యోగులు, చదువుకునేందుకు, పర్యాటకు ప్రాంతాలకు వెళ్లిన వారి.. అన్ని విభాగాల నుంచి వచ్చిన వారి లెక్కలు తేల్చే పనిలో పడింది. స్థానికంగా వాలంటీర్లు, పోలీసు, ఆశా, ఏఎన్‌ఎంల సహకారంతో వివరాలు సేకరిస్తోంది. వీరి సంఖ్య సుమారు 6వేల నుంచి 10వేల వరకు ఉంటుందని అంచనా.
స్వీయ నిర్బంధంలో..