Srikakulam Urban Development Authority: శ్రీకాకుళం నగర అభివృద్ధి అథారిటీ పరిధిని మరింతగా పెంచుతూ పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు జిల్లాల పరిధిలో ఉన్న 307 గ్రామాలను శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో చేరుస్తూ ఆ శాఖ కార్యదర్శి వై. శ్రీలక్ష్మి నోటిఫికేషన్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 7 మండలాలను సుడా పరిధిలోకి తెస్తూ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు.
రెండు జిల్లాల పరిధిలో 307 గ్రామాలు.. సుడా పరిధి పెంపు - ఏపీ తాజా వార్తలు
Srikakulam Urban Development Authority: శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని మరింతగా పెంచుతూ నోటిఫికేషన్ జారీ అయింది. రెండు జిల్లాల పరిధిలో ఉన్న 307 గ్రామాలను అథారిటీలో చేరుస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి నోటిఫికేషన్ జారీ చేశారు. అవేంటంటే..?
suda
శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట, పాతపట్నం, మెలియాపుట్టి, కొత్తూరు, హిరమండలం, లక్ష్మీనరసుపేట మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని మండలాల్లోని 307 గ్రామాలు సుడా పరిధిలోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో కొత్తగా 1,121 చదరపు కిలోమీటర్ల ప్రాంతం శ్రీకాళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చింది. కొత్తగా ఏడు మండలాలను కలపడంతో సుడా పరిధి 5,294 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
ఇవీ చదవండి:
TAGGED:
Srikakulam latest updates