ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రాకాసి.. ఆ ఒక్క గ్రామంలోకి మాత్రం అడుగుపెట్టలేదు. రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నప్పటి నుంచి తమని తాము కాపాడుకోవాలన్న ఆలోచన ఆ గ్రామస్థుల్లో బలపడింది. కొవిడ్ నిబంధనలు తూ.చ పాటిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని కుంబిడి ఇచ్ఛాపురం గ్రామం.
అ గ్రామంలో ఎవరికీ మహమ్మారి సోకలేదు.. ఎలా సాధ్యమైంది!
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రాకాసి... ఆ ఒక్క గ్రామంలోకి మాత్రం అడుగుపెట్టలేదు. రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నప్పటి నుంచి తమని తాము కాపాడుకోవాలన్న ఆలోచన ఆ గ్రామస్థుల్లో బలపడింది.
అ గ్రామంలో ఎవరికి మహమ్మారి సోకలేదు! ఎలా సాధ్యం?
ఈ గిరిజన గ్రామంలో 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరందరికీ ఒకే వ్యక్తి నెలకు సరిపడా సరుకులు వేరుఘట్టం నుంచి తీసుకొస్తున్నారు. ఒక ఇంటి వద్ద వారికి అవసరమైన సరకులను బయటపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇలా ఒక్కరు మాత్రమే గ్రామం నుంచి బయటకు రావడం.. పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవడంతో కరోనా కేసులకు ఆ గ్రామం దూరంగా ఉంది. ఎవరైనా గ్రామంలోకి వస్తే.. 14 రోజుల క్వారంటైన్ తర్వాతే బయటకు అనుమతిస్తారు.
ఇదీ చదవండి: