శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ప్లాస్టిక్ వాడకం కనిపించదు. మూడు నెలల కిందట కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన పుష్పనాధం పాలిథిన్ నిషేధంపై దృష్టి సారించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచారం చేయించారు. వ్యాపారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. అలా అక్కడ పాలిథిన్ నిషేధానికి అడుగులు పడ్డాయి. మెల్లమెల్లగా ప్రజలూ, వ్యాపారులు పాలిథిన్ను వాడడం తగ్గించుకున్నారు. దీన్ని పాటించని వ్యాపారులకు లక్షా ఇరవై వేల వరకు అపరాధ రుసుము విధించారు. ఈ చర్యలతో అంతా ఒక్కటై 90 శాతం పట్టణంలో ప్లాస్టిక్ వాడకం తగ్గిపోయింది.
పాలకొండ పట్టణం.. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం - శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ప్లాస్టిక్ నిషేధం
ఆ పట్టణంలో ప్లాస్టిక్ కనిపించదు. వ్యాపారులు పాలిథిన్ సంచులు విక్రయించరు. అధికారులు, ప్రజలు కలిసి అక్కడ పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నారు. 90 శాతం ప్లాస్టిక్ రహితంగా మారిన సిక్కోలులోని పాలకొండ గురించి మనమూ తెలుసుకుందామా...!
పాలకొండ.. ప్లాస్టిక్ లేని పట్టణం