శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నీలంపేటలోని హుద్‌హుద్ నివాస సముదాయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. కనీస నాణ్యతతో భోజనం ఉండటం లేదని, ప్రతిరోజూ ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గదుల్లో ఫ్యాన్లు సరిపడా లేకపోవడం వల్ల ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని చెప్పారు. శనివారం భోజనం తినకుండా నిరసన తెలపడం వల్ల కేంద్రానికి ఎస్సై లక్ష్మణరావు వచ్చి మత్స్యకారులతో మాట్లాడారు. సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, భోజన నాణ్యత బాగుండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం వల్ల నిరసన విరమించారు.
నాణ్యమైన భోజనం కావాలంటూ మత్స్యకారుల ఆందోళన
నీలంపేట హుద్‌హుద్ నివాసంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. సరైన వసతులు కూడా అధికారులు కల్పించలేదంటూ నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్సై లక్ష్మణరావు కేంద్రాన్ని సందర్శించి విషయం ఉన్నతాధికారులకు తెలియజేస్తామని నచ్చజెప్పారు.
ఎస్సైతో సమస్యలు చెబుతున్ననీలంపేట పునరావాసంలోి మత్స్యకారులు