యాస్ తుపాన్ ప్రభావంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని.. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్థార్ ఆదేశించారు. ఇచ్ఛాపురం మండలం డొంకూరు, కవిటి మండలం ఇద్దువనిపాలెం వంటి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించగా.. ఆ బృందాలు మంగళవారం ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి.
లైఫ్ జాకెట్స్, విద్యుత్ రంపాలు, టార్చ్ లైటులు, డ్రాగన్ లైట్లు, పగ్గం తాళ్లు అత్యవసర సమయాల్లో వినియోగించే ఇతర సామగ్రితో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. అత్యవసర సమయాల్లో ప్రజలను, పశువులను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు తరలించేందుకు, రోడ్డు మార్గంలో చెట్లును తొలగించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా కవిటి పోలీసు స్టేషన్ లో వాహనాలు, జేసీబీలను ఏర్పాటు చేశారు.