చట్టాలపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అదనపు క్రైమ్ ఎస్పీ విఠలేశ్వరావు అన్నారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా.. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల నుంచి ఏడు రోడ్లు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు.
వాహనచోదకులు తప్పని సరిగా శిరస్త్రాణం ధరించాలని, కారులో ప్రయాణిస్తున్న సమయంలో సీటు బెల్టు పెట్టకోవాలని సూచించారు. మద్యం మత్తులో వాహనం నడపకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా వాహనాలు నడిపి.. ప్రమాదాలు నివారించేందుకు పోలీసు వారికి సహకరించాలని కోరారు.