శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఉన్న నరసన్నపేట, జలుమూరు మార్కెట్ కమిటీలకు మంత్రి ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షులుగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ కమిటీలు రైతులకు చేరువ కావాలని సూచించారు. మార్కెట్ ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. మార్కెట్ కమిటీలన్నింటికి నూతన కార్యవర్గం ఏర్పాటు చేయాలని ఆగస్టు 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత తెలుగుదేశం హయాంలో ఉన్న కమిటీలను రద్దు చేసింది. నూతన కార్యవర్గ ఏర్పాటు ముందుగా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కమిటీల గౌరవ అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులలో పేర్కొంది.
నరసన్నపేట మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా మంత్రి ధర్మాన - narasannapeta amc chairman krishnadas
నరసన్నపేట, జలుమూరు మార్కెట్ కమిటీలకు అధ్యక్షులుగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు స్వీకరించారు. రైతులకు మార్కెట్ కమిటీలు చేరువ కావాలని ఆయన సూచించారు.
నరసన్నపేట మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా మంత్రి ధర్మాన
Last Updated : Oct 28, 2019, 8:33 AM IST