శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సామాజిక ఆసుపత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్పు చేసినట్లు జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన నరసన్నపేట సామాజిక ఆసుపత్రిని పరిశీలించారు. జిల్లాలో ఇప్పటికే 13 కొవిడ్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని..పెరుగుతున్న కేసులు దృష్ట్యా మరిన్ని ఆసుపత్రులను గుర్తించి కొవిడ్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
కొవిడ్ ఆసుపత్రిగా నరసన్నపేట సామాజిక ఆసుపత్రి: కలెక్టర్ - నరసన్నపేట కొవిడ్ ఆసుపత్రి వార్తలు
నరసన్నపేట సామాజిక ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్పు చేసినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ స్పష్టం చేశారు. జిల్లాలో ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
Srikakulam District Collector Nivas