Nara Lokesh: వైకాపా అధినేత జగన్ రెడ్డి బాబాయ్‌ని చంపిస్తే.. ఆ పార్టీ నేతలు పట్టపగలు నడివీధిలో మహిళల్ని సజీవ సమాధి చేసే ప్రయత్నాలు చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో తమ ఇంటి స్థలం కబ్జా కాకుండా కొట్రదాలమ్మ, మజ్జి సావిత్రి అడ్డుపడగా.. వైకాపా నేతలైన కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాష్ రావులు... ట్రాక్టర్ గ్రావెల్‌ను మహిళలపై వేయించి చంపాలని చూడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కాపాడాలని మహిళలు రోదిస్తుంటే.. చావండి అంటూ పైశాచికత్వం ప్రదర్శించడం.. జగన్ రెడ్డి జంగిల్ రాజ్‌కు నిదర్శనమని దుయ్యబట్టారు. దాయాదులైన మహిళల పట్ల పశువుల కంటే ఘోరంగా ప్రవర్తించిన వైకాపా నేతలు.. మంత్రి అనుచరులు కావడంతో పోలీసులు ఈ దాష్టీకంపై స్పందించడం లేదని విమర్శించారు.
'మహిళలపై హత్యాయత్నం.. పోలీసులు పట్టించుకోరా..?' - సీఎం జగన్‌పై నారా లోకేశ్ విమర్శలు
Nara Lokesh: శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో తల్లీకూతుళ్లపై మట్టి పోసిన ఘటనపై తెదేపా నేత నారా లోకేశ్ స్పందించారు. వైకాపా నేతలు పట్టపగలు మహిళలను సజీవ సమాధి చేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించకపోవడంపై మండిపడ్డారు.
నారా లోకేశ్