ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానంతో.. నిండు ప్రాణం బలి - శ్రీకాకుళం జిల్లా సమాచారం

ఉత్తర్​ప్రదేశ్​ నుంచి శ్రీకాకుళం జిల్లాకు జీవనాధారం కోసం వలసొచ్చిన ఆ కుటుంబాల్లో అనుమానం చిచ్చు పెట్టింది. తన భార్యతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడనే నెపంతో ఓ వ్యక్తి.. మరో వ్యక్తిని హత్య చేశాడు.

murder
హత్య

By

Published : Aug 14, 2021, 7:31 PM IST

అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నసీం అహ్మద్ (45), ముసిం ఖాన్ అనే వ్యక్తులు కుటుంబాలతో పొట్టకూటి కోసం నెల రోజుల కిందట ఉత్తరప్రదేశ్ నుంచి శ్రీకాకుళం జిల్లాకు వలస వచ్చారు. కుశాలపురం పంచాయతీ పరిధిలోని వెంకటాపురంలో నివాసం ఉంటున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధాన్ని నసీం అహ్మద్​ నెరపుతున్నాడని ముసిం ఖాన్​ అనుమానం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఒంటిగంట సమయంలో నసీం, ముసిం ఖాన్​లు గొడవ పడ్డారు. కోపంతో నసీమ్​ను, ముసిం ఖాన్​ ఇనుప రాడ్డులాంటి ఆయుధంతో తలపై కొట్టి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న ఎచ్చెర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి తమ్ముడు హతిక్ ఫిర్యాదుతో ఎస్​ఐ కె.రాము కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details