MURDER: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో దారుణం జరిగింది. భార్య అప్పమ్మతో పాటు తన సోదరి రాజులమ్మని అప్పన్న అనే వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. అనంతరం తనను తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అడ్డు వచ్చిన తండ్రిని, సోదరి కుమార్తె పద్మను గాయపరిచాడు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పన్న కల్లుగీత కార్మికుడు. అంతేగాక గ్రామంలో మాంసం దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం వారు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున భార్య పై కత్తితో కర్కశంగా దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకోవడానికి వచ్చిన తన సోదరి రాజులమ్మను నిర్ధాక్షణ్యంగా కత్తితో నరికేశాడు.
MURDER: ముద్దాడపేటలో దారుణం... భార్య, సోదరిని చంపి వ్యక్తి ఆత్మహత్యాయత్నం - srikakulam latest news
08:01 January 29
ఇద్దరిని చంపి వ్యక్తి ఆత్మహత్యయత్నం
ఇది చూసిన తండ్రి, సోదరి కుమార్తె అడ్డుకోగా వారిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తనకు తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. భార్య తన సోదరి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన తండ్రి తన సోదరి కుమార్తెతో పాటు హంతకుడు అప్పన్నను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అప్పన్నను తాగుడు మానమని వైద్యులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో రాత్రి మద్యం తాగి రావడంతో.. కుటుంబసభ్యులు మందలించారు. దీంతో చెలరేగిపోయిన అప్పన్న.. కత్తి తో దాడి చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. అప్పన్నను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:FIRE ACCIDENT: బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం...13 మందికి గాయాలు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!