వైకాపా సర్కారుకు పాలన మీద అవగాహన లేక అనేక సమస్యలు తలెత్తాయని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలో తాగునీరు అందని పరిస్థితి నెలకొందని, అవసరమైతే శ్రీకాకుళాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో వైకాపా వాళ్లకి తప్ప.. సామాన్య ప్రజలకు ఎలాంటి పనులు జరగడం లేదంటూ వ్యాఖ్యానించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ జేసీ శ్రీనివాసులుకు పలు సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. రామ్మోహన్‌నాయుడుతో పాటు ఎమ్మెల్యే బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యేలు బగ్గు లక్ష్మణరావు, గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు.
'శ్రీకాకుళాన్ని కరవు జిల్లాగా ప్రకటించాలి'
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు హాజరయ్యారు. జిల్లాలో సాగునీటి ఎద్దడి నెలకొందని, అవసరమైతే కరవు జిల్లాగా ప్రకటించాని డిమాండ్ చేశారు.
'శ్రీకాకుళాన్ని కరవు జిల్లాగా ప్రకటించాలి'