ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుందామని ఎర్రన్నాయుడు కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అభిమానులకు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా తన తండ్రి ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నారని గుర్తు చేశారు. లోక్ సభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం గళమెత్తటంతో పాటు, దిల్లీలో తెలుగుదేశం నాయకుడిగా, తెలుగువారి ప్రతినిధిగా నిలిచారని ఆయన కొనియాడారు.
'అధికారం ఉన్నా.. లేకున్న ప్రజలతోనే ఉన్న నేత ఎర్రన్నాయుడు' - ఎర్రన్నాయుడు జయంతికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నివాళులు వార్తలు
ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నివాళులర్పించారు. ఆయన పోరాట స్ఫూర్తిని మరోసారి గుర్తు చేసుకుందామని ట్విట్టర్ వేదికగా అభిమానులకు పిలుపునిచ్చారు.
ఎంపీ రామ్మోహన్ నాయుడు నివాళులు