ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతి, పోలవరం రాష్ట్రాభివృద్ధిలో కీలకం'

రాష్ట్రాభివృద్ధి ఒకే రాజధాని ఎంతో కీలకమని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. అమరావతి కోసం వేల ఎకరాలు ఇచ్చిన రైతులు 300 రోజులుగా ఆందోళన చేస్తున్నా....వైకాపా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సరికాదని విమర్శించారు. జగనన్న విద్యాకానుకలో వైకాపా ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.

ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఎంపీ రామ్మోహన్ నాయుడు

By

Published : Oct 10, 2020, 7:18 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పర్యటించారు. ఈ పర్యటనలో మాట్లాడిన ఆయన... రాష్ట్ర అభివృద్ధికి ఒకటే రాజధాని ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనానికి 33 వేల ఎకరాలను 23 వేల మంది రైతులు త్యాగం చేశారన్నారు. రైతులకు అన్యాయం చేస్తూ 3 రాజధానులు ఏర్పాటుకు వైకాపా పూనుకుందన్నారు. అమరావతి రైతులు 300 రోజులుగా ధర్నా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం సబబుకాదన్నారు.

రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి, పోలవరం నిర్మాణాలు కీలకమని రామ్మోహన్​ నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని అన్యాయంగా అరెస్టు చేస్తున్నారన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో కీలకమైన కాగువాడ వంతెన నిర్మాణానికి 2016లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మంజూరు చేశాయని గుర్తుచేశాయి. ఈ నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం కొనసాగించాల్సింది పోయి గత ప్రభుత్వాన్ని నిందించడం అన్యాయమన్నారు. జగనన్న విద్యా కానుకలో పార్టీ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు.

ఇదీ చదవండి :దర్శకుడు రాజమౌళిపై 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఫిర్యాదులు!

ABOUT THE AUTHOR

...view details