ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MP Rammohan Naidu: 'ఆదాయ వనరులు అభివృద్ధి చేయలేకే.. చెత్తపై పన్ను' - MP Rammohan Naidu

MP Rammohan Naidu on YSRCP: రాష్ట్రంలో ఆదాయపు వనరులు అభివృద్ధి చేయలేక చెత్తపన్నులు సృష్టిస్తున్నారని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాంతంత్య్ర దేశంలో చెత్తపై ఏ ప్రభుత్వం పన్ను వేయలేదన్నారు.

MP Rammohan Naidu on sewerage tax in AP
MP Rammohan Naidu on sewerage tax in AP

By

Published : Jan 6, 2022, 10:27 PM IST

MP Rammohan Naidu on sewerage tax in AP: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా.. చెత్తపై ఏ ప్రభుత్వం పన్ను వేయలేదని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయని మంత్రులు ఒప్పుకునే పరిస్థితి కనబడుతోందని.. శ్రీకాకుళంలో రామ్మోహన్​ నాయుడు అన్నారు.

చెత్తపన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త వేయాలని వైకాపా ఎమ్మెల్యే చెబుతున్నారంటే.. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం అవుతుందన్నారు. రాష్ట్రంలో ఆదాయ వనరులను ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలో తెలియక.. ఇటువంటి పన్నులను సృష్టిస్తున్నారని ఎంపీ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details