ఎన్నికల ప్రకటన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు కాదని సుప్రీంకోర్టుకు వెళ్లటం సరికాదన్నారు.
వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో ఎన్నికలు నిర్వహించడానికి జగన్ భయపడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా చేసుకొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు.