తెదేపా కార్యకర్తలు అధైర్యపడొద్దని.. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. నిమ్మాడలోని ఆయన బంధువు అచ్చెన్నాయుడు ఇంటి వద్ద.. పలువురు నాయకులతో సమావేశం నిర్వహించారు.
ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని.. అక్రమ కేసులకు భయపడొద్దని పార్టీ శ్రేణులకు ఎంపీ దిశానిర్దేశం చేశారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అన్ని విషయాల్లో కార్యకర్తలకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.