ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీ నిధుల నుంచి అంబులెన్స్​లు, బస్సు అందజేత - district health hospital ambulances latest news

శ్రీకాకుళం జిల్లాకు మూడు అంబులెన్సులతో పాటు బీ.ఆర్‌ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి బస్సును ఎంపీ కింజరాపు రామ్మోహన్​నాయుడు అందజేశారు. ఎంపీ నిధులు నుంచి ఇవీ మంజూరు చేసినట్లు తెలిపారు.

mp rammohan naidu
అంబులెన్స్​లు, బస్సు అందజేస్తున్న ఎంపీ రామ్మోహన్​నాయుడు

By

Published : Nov 4, 2020, 12:32 PM IST

ప్రజల అవసరాలకు ఎంపీ నిధులు ఎంతో ఉపయోగకరమని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు మూడు అంబులెన్సులతో పాటు బీఆర్‌ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి బస్సును ఆయన ఇచ్చారు. కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్‌ నివాస్‌తో కలిసి వీటిని అందజేశారు. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రితో పాటు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి, సీతంపేట ఐటీడీఏకు ఒక్కోఅంబులెన్సును కేటాయించారు. అలాగే అంబేద్కర్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లేటప్పుడు ఇబ్బందులకు గురి అవుతున్న కారణంగా బస్సును అందజేసినట్లు ఎంపీ తెలిపారు. 92 లక్షల 56 వేలు ఎంపీ ల్యాడ్ నిధులను నుంచి వీటిని కేటాయించినట్లు పేర్కొన్నారు. మౌళికసదుపాయాల ఇబ్బందులను తొలగించుటకు ఈ నిధులు ఎంతో ఉపయోగకరమన్న రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వం వీటి విడుదలను పునరుద్దరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details