శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బెందాళం ఆశోక్, తెదేపా నాయకులు.. కలెక్టర్ నివాస్‌ను కలిశారు. ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని రామ్మోహన్‌నాయుడు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా తెలుగుదేశం పార్టీ బలాన్ని నిరూపిస్తామన్నారు.
18 నెలల్లో అప్పుల మీద అప్పులు తెచ్చారు: రామ్మోహన్‌నాయుడు - వైసీపీపై టీడీపీ లీడర్స్ ఫైర్
వైకాపా సర్కారు పాలనలో ఎక్కడా రాజ్యాంగం కనిపించడం లేదని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. ప్రజా సమస్యలపై తెదేపా పోరాడుతుందని పేర్కొన్నారు.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/14-December-2020/9879737_tdp.jpg
జిల్లాలో ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. 18 నెలల్లో అప్పుల మీద అప్పులు పెరుగుతున్నాయన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు సొంత నియోజకవర్గంలో మత్స్యకారుల భరోసా పేరిట అవినీతి జరిగిందని కలెక్టర్ దృష్టికి తీసువెళ్లామని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'నిరాహార దీక్ష'తో కేంద్రానికి రైతుల హెచ్చరిక