శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును సంసద్‌రత్న అవార్డు వరించింది. అతి పిన్న వయస్సులోనే ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడు ఈ అవార్డు అందుకోవటం మరో ఘనత. పార్లమెంటు సభ్యునిగా కనపరిచిన అత్యుత్తమ పనితీరు, ప్రజాసమస్యలపై ఎంపీ చూపిస్తున్న చొరవను గుర్తించిన జ్యూరీ కమిటీ ఈ ప్రత్యేక అవార్డుకు రామ్మోహన్ నాయుడు పేరును సూచించింది. దేశవ్యాప్తంగా 8 మంది పార్లమెంటు సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులను 2019-20 సంవత్సరం సంసద్ రత్న అవార్డులకు ఎంపిక చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జ్యూరీ కమిటీ ఈ ఎంపిక చేసింది.
ప్రజాసేవకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజకీయ ప్రముఖులు శశి థరూర్, సుప్రియ సులే వంటి సీనియర్ నాయకులతో కలిసి ఈ అవార్డును అందుకోనుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2010లో సంసద్ రత్న అవార్డులను ప్రారంభించారు. కొవిడ్ -19 వైరస్ వ్యాప్తి తగ్గి, లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత అవార్డుల ప్రదాన కార్యక్రమం ఉంటుందని ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్, సంసద్ రత్న అవార్డుల కమిటీ ఛైర్మన్ కె. శ్రీనివాసన్ తెలిపారు.
- చంద్రబాబు అభినందనలు..