ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ పాలనకు చరమగీతం పాడేరోజు దగ్గర్లోనే ఉంది: రామ్మోహన్ నాయుడు

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ పాలనకు చరమగీతం పాడేరోజు దగ్గర్లోనే ఉందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన...బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారని మండిపడ్డారు.

జగన్ పాలనకు చరమగీతం పాడేరోజు దగ్గర్లోనే ఉంది
జగన్ పాలనకు చరమగీతం పాడేరోజు దగ్గర్లోనే ఉంది

By

Published : Dec 15, 2020, 9:35 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఎంపీ రామ్మోహన్ నాయడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ పర్యటించారు. ఈదుపురంలో మత్స్యకారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార భవనం అసంపూర్తిగా ఉందని మత్స్యకారులు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లగా...ఎంపీ నిధులు మంజూరు చేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.

తెదేపా కార్యకర్తలు అధైర్యపడొద్దని.. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ పాలనకు చరమగీతం పాడేరోజు దగ్గర్లోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి నిరుపేదకు అండగా నిలుస్తామన్నారు. అంతర్జాతీయ సంస్థలు..వేల కోట్ల పెట్టుబడులతో తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంటే...మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తిత్లీ తుపాను బాధితులకు జనవరిలోపు పరిహారం ఇవ్వకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details