ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దు' - ఎంపీ రామ్మోహన్ నాయుడు తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్ పంచాయతీలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వ హయాంలో పంచాయతీలు ఎంతో అభివృద్ధి చెందాయని గుర్తు చేసుకున్నారు.

MP Rammohan Naidu campaigning in Narasannapeta Major Panchayat in Srikakulam district
'వైకాపా మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దు'

By

Published : Feb 18, 2021, 8:14 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్ పంచాయతీలో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నరసన్నపేటలోని పెద్దపేట వీధి నుంచి సత్యవరం వరకు ప్రచారం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో పంచాయతీలు ఎంతో అభివృద్ధి చెందాయని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు.

వైకాపా మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులనే గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, సర్పంచ్ అభ్యర్థి బెవర రాము, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details