ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అక్రమ కేసులు పెడుతున్న వారికి తగిన బుద్ధి చెప్తాం' - తెదేపా నేతలపై కేసులపై రామ్మోహన్ నాయుడు ఆగ్రహం

తెదేపా నేతలపై అక్రమ కేసులు పెడుతున్నవారికి తగిన బుద్ధి చెప్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీరాంపురంలో అక్రమ కేసులు బనాయించిన తెదేపా నేత మాదిన రామారావు కుటుంబాన్ని పరామర్శించారు.

ram mohan naidu
ఎంపీ రామ్మోహన్ నాయుడు

By

Published : Nov 23, 2020, 6:45 PM IST

తెదేపా నేతలపై దాడులు చేస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్న అధికార పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం శ్రీరాంపురానికి చెందిన తెదేపా నేత మాదిన రామారావు, సోషల్ మీడియా కార్యకర్త సిద్ధార్థలపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. వారి కుటుంబాలను ఎంపీ పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. మంచి చేస్తారని ప్రజలు అధికారం ఇస్తే ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడం తగదన్నారు. మాదిన రామారావుపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా.. 20 మంది పింఛనుదారులు, 40 మంది రేషన్ కార్డుదారులు రేషన్ తీసుకోవడం మానేశారు.

ABOUT THE AUTHOR

...view details