ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విగ్రహాల ధ్వంసం సిగ్గుమాలిన చర్య: ఎంపీ రామ్మోహన్ - ఎంపీ రామ్మోహన్ న్యూస్

నేతల విగ్రహాలు ధ్వంసం చేయటం సిగ్గుమాలిన చర్య అని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో దుండగులు ధ్వంసం చేసిన ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలను పరిశీలించిన ఆయన..ఘటనను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

విగ్రహాల ధ్వంసం సిగ్గుమాలిన చర్య
విగ్రహాల ధ్వంసం సిగ్గుమాలిన చర్య

By

Published : Jan 13, 2021, 9:22 PM IST

నేతల విగ్రహాలు ధ్వంసం చేయటం సిగ్గుమాలిన చర్య అని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో దుండగులు ధ్వంసం చేసిన ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలను ఆయన పరిశీలించారు. ఇటువంటి చర్యలు ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని ఆక్షేపించారు. జగన్ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి..రాజారెడ్డి రాజ్యాంగం లాంటి ప్రత్యేక పుస్తకం అచ్చువేయిస్తే చెప్పలేమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చెత్త రాజ్యాంగాలు అమలుచేస్తే ఏ ఒక్కరూ సహించే పరిస్థితిలో లేరని అన్నారు. గత 19 నెలలుగా విధ్వంసం సృష్టించి రాష్టాన్ని బూడిదపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా వేదిక నుంచి సీఎం జగన్ విధ్వంసం మొదలైందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆలయాలపై దాడులు నిర్వహిస్తూ..గ్రామాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

రాజకీయాలంటే కండువాలు, ఫ్లెక్సీలు వేసుకోవటం కాదని.., ప్రజలకు మంచి చేసి స్ఫూర్తిని రగిలించాలని హితవు పలికారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.

ఇదీచదవండి:సంతబొమ్మాళిలో ఎన్టీఆర్​, ఎర్రన్నాయుడు విగ్రహాలు ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details