ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజల్లో అనుమానం, ఆందోళన పెంచుతున్నారు' - cm jagan

సీఎం జగన్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ... ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. టెక్కలి పట్టణంలోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎంపీ రామ్మోహన్ నాయుడు

By

Published : Aug 23, 2019, 11:10 PM IST

ఎంపీ రామ్మోహన్ నాయుడు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలోని తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు, వ్యవస్థలను సొంతపార్టీ కోసం వినియోగిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓవైపు వరదలు పోటెత్తుతుంటే... ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు ఎందుకు నీరివ్వలేక పోతున్నారని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టును ఆపాలనే దురాలోచనతో... రివర్స్ టెండరింగ్​కు పిలిస్తే ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురైందని రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిపై కూడా విషం చిమ్ముతూ... ప్రజల్లో అనుమానం, ఆందోళన పెంచుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయ దురాలోచనతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. తమకు తెదేపా ఓడిపోయిందన్న బాధ కంటే... రాష్ట్రం ఓడిపోతోందన్న బాధే ఎక్కువగా ఉందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details