ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''ప్రత్యేక హోదాపై.. కేంద్రంతో సీఎం​ కనీసం చర్చించడం లేదు'' - MP Rammohan Naidu comments on capital

MP Ram Mohan Naidu: ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పిన జగన్మోహన్​రెడ్డి.. ఇప్పుడు కేంద్రంతో కనీసం కూడా చర్చించడం లేదని తెదేపా ఎంపీ రామ్మోహన్​నాయుడు ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేపట్టని ప్రభుత్వం.. రాజధానిపై కట్టుకథలు చెబుతుందని ధ్వజమెత్తారు.

MP Ram Mohan Naidu
ఎంపీ కింజరాపు రామ్మోహన్​ నాయుడు

By

Published : Nov 11, 2022, 4:27 PM IST

MP Ram Mohan Naidu: విశాఖ రాజధాని పేరుతో వైకాపా నాయకులు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను వైకాపా నాయకులు పక్కన పెట్టి.. రాజధాని అంశంపై కట్టుకథలు చెబుతున్నారన్నారు. తెదేపా ప్రభుత్వం హయాంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం గడిచిన ఈ మూడేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా తెస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎన్నికల ముందు చెప్పిన జగన్​మోహన్ రెడ్డి.. ఇప్పుడు కేంద్రంతో కనీసం చర్చ కూడా చేయడం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details