ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మకు పరీక్ష.. బిడ్డకు శిక్ష - టెక్కలిలో పిల్లల వ్యాక్సిన్‌ వార్తలు

కరోనా వ్యాప్తి కారణంగా చాలా ప్రాంతాల్లో 45 రోజులుగా చంటిబిడ్డలకు వ్యాక్సినేషన్‌ చేయలేదు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం వ్యాక్సిన్‌ వేస్తున్నారని తెలుసుకొన్న తల్లులు పెద్దఎత్తున ప్రభుత్వాసుపత్రికి చేరుకొన్నారు. అక్కడ వారికి వ్యాక్సిన్ చేయలేదు. భౌతిక దూరం పాటించలేదు.

mother waiting at tekkali for child vaccine
టెక్కలిలో పిల్లల వ్యాక్సిన్‌

By

Published : Aug 21, 2020, 1:01 PM IST

కరోనా వ్యాప్తి కారణంగా చాలా ప్రాంతాల్లో 45 రోజులుగా చంటిబిడ్డలకు వ్యాక్సినేషన్‌ చేయలేదు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం వ్యాక్సిన్‌ వేస్తున్నారని తెలుసుకొన్న తల్లులు పెద్దఎత్తున ప్రభుత్వాసుపత్రికి చేరుకొన్నారు. జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో స్థలాభావం వల్ల స్థానిక అంబేడ్కర్‌ భవన్‌ వరండాలో వ్యాక్సినేషన్‌ చేపట్టారు. చంటిపిల్లలతో వచ్చిన తల్లులకు అక్కడ కూర్చునేందుకు కుర్చీలు లేవు. భౌతిక దూరం మాటే లేదు. చల్లని వాతావరణంలో ఆరుబయటే చంటిబిడ్డలతో మహిళలు నిరీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details