పట్టణ ప్రాంతాల్లోని గృహనిర్మాణ కార్యక్రమాల నిమిత్తం టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో మరో 30.91 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. విశాఖ , శ్రీకాకుళంలో ప్రతిపాదిత 5వేల 88 యూనిట్ల నిర్మాణాలకు 306.61 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ చేపడితే డీఐసీ ఇన్‌ఫ్రా సంస్థ 275.7 కోట్లకే బిడ్ దాఖలు చేసి ఎల్1గా నిలిచింది. ఇప్పటివరకూ మొత్తం 12 విడతల్లో 63 వేల744 యూనిట్ల నిర్మాణానికి సంబంధించి 392.23 కోట్ల మేర ప్రజాధనం ఆదా అయినట్టు మంత్రి బొత్స వివరించారు. వీలైనంత త్వరగా ఈ నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందచేస్తామన్నారు.
'టిడ్కోలో రివర్స్ టెండరింగ్‌తో 30 కోట్లు ఆదా చేశాం' - రివర్స టెండరింగ్
రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని గృహనిర్మాణ కార్యక్రమాల నిమిత్తం టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో మరో 30.91 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.
టిడ్కో రివర్స్ టెండరింగ్