ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దు: ఎమ్మెల్సీ మాధవ్ - ఎమ్మెల్సీ మాధవ్ తాజా వార్తలు

రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని.. హిందువుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు మానుకోవాలని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఆలయాలపై దాడులు చేసేవారిని శిక్షించకుండా.. ప్రశ్నిస్తున్న వారిని నిర్బంధించడం ప్రభుత్వానికి తగదని సూచించారు.

madhav, bjp mlc
మాధవ్, భాజపా ఎమ్మెల్సీ

By

Published : Oct 1, 2020, 6:42 AM IST

రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు మానుకోవాలని వైకాపా ప్రభుత్వానికి భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ హితవుపలికారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మాట్లాడారు. విగ్రహాల ధ్వంసం, రథాలు తగులబెట్టడం, దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం చేయడం వంటి చర్యలు తగవన్నారు.

హిందూ దేవాలయాల గురించి మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వెంటనే కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాలపై దాడులు చేసేవారిని శిక్షించకుండా.. ప్రశ్నిస్తున్న భాజపా కార్యకర్తలను నిర్బంధించడం తగదన్నారు.

ABOUT THE AUTHOR

...view details