Employees unions demand cancellation of CPS: గతంలో తమకు ఇచ్చిన హామీలను మరిచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు లాభాన్ని చేకూర్చే సీపీఎస్, జీపీఎస్ విధానాల్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా యూటిఎఫ్ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు చేయాలని సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం రైతు బజారు వద్ద సంతకాలు సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సీపీఎస్ విధానానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన జీపీఎస్ విధానం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏమాత్రం లాభదాయకం కాదన్నారు. ఇచ్చిన హామీని జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కారని విమర్శించారు.
యూటిఎఫ్ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దుకు సంతకాల సేకరణ - యూటీఎఫ్ సంతకాల సేకరణ కార్యక్రం
UTF demanded to cancel CPS: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సీపీఎస్, జీపీఎస్ విధానాల్ని రద్దు చేయాలంటూ... పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో యూటిఎఫ్ ఆధ్వర్యంలో.. సీపీఎస్ రద్దు చేయాలని సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు.
ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు