శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైకాపా వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఈరోజు జరగబోయే మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరిస్తే కళింగ కార్పొరేషన్ ఛైైర్మన్ పేరాడ తిలక్‌తో పాటు ఎంపీటీసీ సభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. అర్ధరాత్రి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక వీడియో సందేశాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ విడుదల చేశారు. నందిగాం మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను.. అన్ని ఎంపీటీసీ స్థానాలను వైకాపానే గెలుచుకుంది.
MLC DUVVADA SRINIVAS: 'పార్టీ అదేశాలు ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తాం..!' - ap latest news
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో 11 మంది ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని... పార్టీ అదేశాలు ధిక్కరిస్తే పదవి నుంచి సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు.
![MLC DUVVADA SRINIVAS: 'పార్టీ అదేశాలు ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తాం..!' mlc-duvvada-srinivas-released-a-video-on-mpp-and-vicc-mpp-elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13155727-thumbnail-3x2-duvvada.jpg)
అయినప్పటికీ వారిలో 11మందిని కిడ్నాప్ చేసి వేరే ప్రాంతానికి తరలించారని దువ్వాడ ఆరోపించారు. నియోజకవర్గంలోని పరిస్థితిని ముఖ్యనేత విజయసాయిరెడ్డికి వివరించానన్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే ఎంతటివారినైనా పార్టీ ఉపేక్షించదని విజయసాయిరెడ్డి స్పష్టం చేసినట్లు దువ్వాడ పేర్కొన్నారు. విప్‌ను ధక్కిరించిన వెంటనే ఎంపీటీసీ సభ్యులు తమ పదవిని కోల్పోతారన్నారు. తిలక్ సహా ఎంపీటీసీ సభ్యులందరూ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:AP DEBTS: దారి తప్పిన అప్పు..పడకేసిన ప్రాజెక్టులు