ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రూ.10 వేల సాయం చేస్తాం.. ధైర్యంగా ఉండండి' - corona cases in srikakulam dst

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చెప్పారు. కొయ్యాం గ్రామంలో క్వారంటైన్ లో ఉన్న మత్స్యకారులను ఎమ్మెల్యే పరామర్శించారు.

mla visits srikakulam dst fishermens who leaving in qurentin center
mla visits srikakulam dst fishermens who leaving in qurentin center

By

Published : May 6, 2020, 6:52 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని వేరావల్ లో చిక్కుకున్న మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాకు చేరుకుని పునరావాస కేంద్రంలో ఉన్నారు. ఎచ్చెర్ల మండలం కొయ్యాం గ్రామంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని క్వారంటైన్ లో ఉన్నవారిని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పరామర్శించారు.

"వైఎస్సార్ మత్స్యకార భరోసా"పథకం కింద మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనున్నట్టు చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారంతా భౌతికదూరం పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details