శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల ఎంపికలో పార్టీ నిర్ణయమే అంతిమం అని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులో ఉన్న ఓ పంక్షన్ హల్‌లో వైకాపా నాయకులతో.. కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ధర్మాన నిర్వహించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయమై తనను ఎవరు కలవవద్దని సూచించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా.. వ్యక్తిగత నిర్ణయాన్ని తీసుకోలేనని చెప్పారు. పార్టీ తరుపున ఏవరు పోటీ చేస్తారనేది అధిష్టానవర్గం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థులు ఎంపిక విషయంలో సామాజిక న్యాయం పాటించాలనేది అధిష్టానానికి సూచిస్తానని తెలిపారు.
అభ్యర్థుల ఎంపికలో పార్టీదే అంతిమ నిర్ణయం - ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తాజా వార్తలు
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో పార్టీ నిర్ణయమే అంతిమం అని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తేల్చి చెప్పారు. ఈ విషయంలో వ్యక్తిగత నిర్ణయం తీసుకొలేనని స్పష్టం చేశారు.
అభ్యర్థుల ఎంపికలో పార్టీదే అంతిమ నిర్ణయం