ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంశధార ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం: ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ - dharmana krishna das on Vamsadhara Project

వంశధార ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు ప్రధానమైన నీటి వనరు వంశధార ప్రాజెక్టు అని తెలిపారు. వంశధార నిర్వాసితులకు త్వరలోనే పూర్తి స్థాయి పరిహారం అందిస్తామని చెప్పారు.

dharmana krishna das
dharmana krishna das

By

Published : Sep 8, 2020, 6:52 PM IST

వంశధార ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలో కోటి 98 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టు సూపరింటెండెంట్ పర్యవేక్షణ ఇంజినీర్ కార్యాలయ భవనాన్ని... సభాపతి తమ్మినేని సీతారాం.. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులతో కలిసి ప్రారంభించారు.

జిల్లాకు ప్రధానమైన నీటి వనరు వంశధార ప్రాజెక్టు అని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యత గల జలవనరుల ప్రాజెక్టుల్లో వంశధారను చేర్చామన్నారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారం కూడా త్వరలో అందిస్తామని తెలిపారు. నదులకు శ్రీకాకుళం జిల్లా నిలయమని సభాపతి తమ్మినేని సీతారాం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details