ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ministers Fires On Pawan: 'పవన్​ ఆరాటం ప్యాకేజీల కోసమే.. ప్రజల కోసం కాదు' - minister jayaram fires on pawan

జనసేన చేపట్టిన శ్రమదానం కార్యక్రమంపై మంత్రులు ఫైర్ (Ministers Fires On Pawan news) అయ్యారు. పవన్ కల్యాణ్​ది ప్రశ్నించే పార్టీ కాదని.. ప్యాకేజీ పార్టీ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రహదారులపై మాట్లాడుతున్న పవన్.. జాతీయ రహదారులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రజలంతా వైకాపా వైపు ఉన్నారనే విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు.

Ministers Fires On Pawan
Ministers Fires On Pawan

By

Published : Oct 2, 2021, 7:16 PM IST

Updated : Oct 2, 2021, 8:44 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైకాపా మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే(Ministers Fires On Pawan news) ఉంది. తాజాగా పవన్ 'శ్రమదానం' కార్యక్రమం(pawan sramadhanam news)పై మంత్రులు ఫైర్ అయ్యారు. రాజకీయ చతురత లేని నాయకుడు పవన్ అంటూ ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ పేరుతో కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.

కాలక్షేపం చేస్తున్నారు: మంత్రి ధర్మాన

రాజకీయ చతురత లేని నాయకుడు పవన్ కల్యాణ్ అని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్(minister dharmana krishna das news) అన్నారు. శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. పవన్ సినిమాలో మంచి నటుడు అన్న ధర్మాన.. రాజకీయాల్లో అనుభవం లేదని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ పెట్టి కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.

తెదేపా స్క్రిఫ్ట్ చదువుతున్నారు: మంత్రి జయరాం

జనసేన పార్టీ అధినేతగా ఉంటూ.. పవన్ పోటీ చేసినా రెండు స్థానాల్లో ఓడిపోయారని మంత్రి జయరాం ఎద్దేవా(minister jayaram fires on pawan) చేశారు. ఆలూరు క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. తెదేపా రాసిచ్చిన స్క్రిఫ్ట్ ను పవన్ చదువుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు.

ప్రశ్నించే పార్టీ కాదు. ప్యాకేజీ తీసుకునే పార్టీ: మంత్రి శంకరనారాయణ

పవన్​పై మంత్రి శంకరనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుకొండలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ తీసుకునే పార్టీ అంటూ సెటైర్లు విసిరారు. రాష్ట్ర రహదారుల గురించి మాట్లాడుతున్న పవన్.. జాతీయ రహదారులపై మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. వర్షాలు ఆగిన వెంటనే రోడ్డు మరమ్మతులు చేపడతామని.. ఆయన ఉనికి కోసం బూటకపు రోడ్డు శ్రమదానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్యాకేజీల కోసమే పవన్ ఆరాటం తప్ప..ప్రజల కోసం కాదన్నారు. రోడ్ల శ్రమదానం పేరుతో కొత్త వేషం వేస్తున్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా వైకాపా... వైపే ఉన్నారన్న విషయాన్ని పవన్ గ్రహించాలని హితవు పలికారు.

తన ప్యాకేజీని పెంచుకోవడానికే శ్రమదానం: మంత్రి వేణుగోపాలకృష్ణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్​.. సీజనల్ పొలిటీషియన్​గా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. తనవెంట జనాలు ఉన్నారని చూపించి.. 2024లో తన ప్యాకేజీ పెంచుకునే ప్రయత్నమే నేటి ఈ శ్రమదానం కార్యక్రమని అని విమర్శించారు. 'పవన్ మాట్లాడే ప్రతి మాట, చేష్టల్లో.. తాను కనీసం ఎమ్మెల్యే కాలేకపోయాననే అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. మహాత్మ గాంధీ పుట్టినరోజున పవన్ రాజకీయ క్రీడా ఆడారు. నేటి శ్రమదానంలో పవన్ నోటికే పనిచెప్పారని కానీ.. పారకు కాదు. ప్యాకేజీల కొరకు రోజుకో పార్టీతో పొత్తులు పెట్టుకునే చరిత్ర మీది. శ్రమదానం అంటే ఎలా చేయకూడదో.. పవన్​ను చూసి ప్రజలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఈనెల నుంచి రోడ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో ప్రకటించారు. నేటి శ్రమదానంతో పవన్ సాధించింది ఏమీ లేదు' అని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు.

పవన్ శ్రమదానం..

అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం((pawan sramadhanam news) చేశారు. అనంతరం బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. '‘పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరు. రాజ్యాంగం కల్పించిన హక్కును అడ్డుకోలేరు. తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప వంగేది లేదు. ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఆపలేదు. పోలీసుల ద్వారా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు తొక్కేయొద్దు. మీరు తొక్కే కొద్ది మేము పైకి లేస్తాం' అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు..

పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని పవన్ అన్నారు. నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసని ప్రశ్నించారు. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకే వచ్చానన్నారు. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష అని అన్నారు. శ్రమదానం తనకు సరదా కాదని..,కులాల పేరిట కొందరు రాజకీయాలు చేస్తున్నారని పవన్​ మండిపడ్డారు.

ఇదీ చదవండి

PAWAN KALYAN: ప్రజల కోసమే తిట్లు భరిస్తున్నా.. నా కోసమే అయితే నార తీసేవాడిని: పవన్‌

Last Updated : Oct 2, 2021, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details