పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదంతో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాలకు చేసినది కాదన్న మంత్రి... రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన అప్పలరాజు... ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావును కలిశారు.
'ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధిలో పరుగులు తీస్తుంది' - సీదిరి అప్పలరాజు తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు స్వాగతించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని పేర్కొన్నారు.
సీదిరి అప్పలరాజు