రైతు శ్రేయస్సే వైకాపా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అప్పలరాజు అన్నారు. సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత పంపిణీ కార్యక్రమంలో... వీడియోకాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, మంత్రి ధర్మానతో పాటు ఆయన పాల్గొన్నారు.
సాధారణ రైతులతో పాటు దేవాదాయ, అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు కూడా అంతే మొత్తం సహాయాన్ని అందించటం జరుగుతోందని మంత్రి అప్పలరాజు అన్నారు. జిల్లాలో 2019-20 సంవత్సరంలో 3 లక్షల 34 వేల రైతు కుటుంబాలకు 450 కోట్ల 98 లక్షల ఆర్థిక సహాయంగా అందిచామన్నారు. 2020-21 సంవత్సరంలో మొదట విడతలో భాగంగా జిల్లాలోని 3 లక్షల 64 వేల రైతు కుటుంబాలకు 2 కోట్ల 73 వేల మొత్తాన్ని ఖాతాలో జమ చేశామని కలెక్టర్ నివాస్ ప్రకటించారు. ఉద్యానవన పంటలకు కూడా రైతు భరోసా పథకం వర్తించేలా ఏర్పాట్లు చేసిందని చెప్పారు.