ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భావనపాడు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తుంది: మంత్రి అప్పలరాజు - భావనపాడు పోర్టు

భావనపాడు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తుందని మంత్రి అప్పలరాజు తెలిపారు. త్వరలోనే పోర్టు నిర్మాణ పనులను పూర్తి చేస్తామని చెప్పారు.

minister sidiri appalaraju
minister sidiri appalaraju

By

Published : Aug 29, 2020, 7:16 PM IST

భావనపాడు పోర్టును త్వరలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి సిదిరి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం కలెక్టరేట్​లో మీడియాతో మాట్లాడిన మంత్రి... భావనపాడు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తుందని చెప్పారు. పోర్టు డీపీఆర్​ను రైట్స్ సంస్థ తయారు చేసిందని తెలిపారు. 2,217 ఎకరాల్లో పోర్టు నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్​తో పాటు నువ్వులరేవు, మంచినీళ్లపేట వద్ద జెట్టీలు నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. మత్స్యకారుల వలసల నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details