మాంసం ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే యోచన ఉన్నట్లు మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ అంశంపై సీఎం జగన్ కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. మాంసం ఉత్పత్తులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేదన్న మంత్రి.. అపరిశుభ్ర పరిసరాల్లో మాంసం విక్రయించే పరిస్థితులను మార్చాలని పేర్కొన్నారు. ప్రభుత్వమే మాంసం విక్రయిస్తుందని ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. తెదేపా, భాజపాలు ఇంకా ఎంత కాలం తెరచాటు బంధాన్ని కొనసాగిస్తాయని మంత్రి మండిపడ్డారు.
ప్రభుత్వమే మాంసం విక్రయిస్తుందనే ప్రచారం సరికాదు: మంత్రి సీదిరి - minister-seediri-appalraju-giving-explanation-on-meat-shops
17:04 September 13
మాంసం ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే యోచన: సీదిరి
217 జీవో.. ట్యాంకులకు సంబంధించినదని మంత్రి అన్నారు. నెల్లూరు జిల్లాలోని ట్యాంకులనే వేలం వేస్తామనేది జీవోలోని సారాంశమని వెల్లడించారు. కానీ ప్రతిపక్ష నేతలు వేరే అర్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని చెరువులూ వేలం వేస్తున్నారనే దుష్ప్రచారం తగదన్న మంత్రి.. మిగిలిన చెరువులన్నీ మత్స్యకారుల ఆధ్వర్యంలో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ జీవోపై మత్స్యకారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే జీవోపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ 'ఉక్కు'పై దిల్లీ నేతలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎందుకు లేఖ రాయడం లేదని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు.
మాంసం ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఆలోచన ఉంది. మాంసం ఉత్పత్తులపై ఇంకా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేదు. ప్రభుత్వమే మాంసం విక్రయిస్తుందనే ప్రచారం సరికాదు. 217 జీవోపై మత్స్యకారులు ఆందోళన చెందవద్దు. రాజకీయ లబ్ధి కోసమే జీవోపై ప్రతిపక్షాల రాద్ధాంతం చేస్తున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సోము వీర్రాజు కేంద్రాన్ని ప్రశ్నించాలి.
-సీదిరి అప్పలరాజు, మంత్రి
ఇదీచదవండి.