ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థి మృతిపై బంధువుల ఆందోళన.. నచ్చజెప్పేందుకు మంత్రి ప్రయత్నం - చిలకపాలెంలో విద్యార్థి బంధువులకు నచ్చజెపుతున్న మంత్రి అప్పలరాజు

అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన బీటెక్ విద్యార్థి నగేష్ విషయాన్ని.. కళాశాల యాజమాన్యం, పోలీసులు పట్టించుకోవడం లేదంటూ అతడి బంధువులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి వారిని నిలువరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది. మంత్రి సీదిరి అప్పలరాజు అక్కడికి వెళ్లి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

minister appalaraju speaking with student relatives at chilakapalem
చిలకపాలెంలో విద్యార్థి బంధువులతో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

By

Published : Jan 28, 2021, 8:10 PM IST

చిలకపాలెంలో విద్యార్థి బంధువులతో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా.. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీదిరి అప్పలరాజు అక్కడికి వెళ్లారు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుకు చెందిన బీటెక్ విద్యార్థి నగేష్ మృతిపై బంధువులు ఆందోళన చేస్తుండగా.. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

రణస్థలం వద్ద బుధవారం అనుమానాస్పదస్థితిలో సజీవ దహనమైన విద్యార్థి నగేష్ విషయాన్ని.. కళాశాల యాజమాన్యంతో పాటు పోలీసులు పట్టించుకోవడం లేదని మృతుడి బందువులు ఆరోపిస్తున్నారు. కళాశాలను చుట్టుముట్టి అద్దాలు ధ్వంసం చేశారు. వీరిని అదుపు చేయడానికి పోలీసులు అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details