MINISTER RAJINI ON UDDANAM PEPOLE KIDNEY PROBLEMS: ఉద్దానంలో కిడ్నీ సమస్య కొత్తగా వచ్చిందేమీ కాదని.. దశాబ్దాలుగా ఈ సమస్య ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఈ సమస్య ఉత్పన్నం కాలేదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. 2019లో సీఎం జగన్ ఆ ప్రాంతంలో ఆస్పత్రి పెట్టాలని ఆలోచించేంత వరకూ ఎవరూ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. 2023 నాటికి ఈ ఆస్పత్రి నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల్ని చంద్రబాబు ఎందుకు ఆదుకోలేకపోయారని ప్రశ్నించారు.
17 ల్యాబ్ల ద్వారా పరీక్షలు నిర్వహించి ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కవిటీ, పలాస తదితర ఆస్పత్రుల్లో 65 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయని.. 21 వేల మందికి పైగా కిడ్నీ మెడికల్ మెనెజ్మెంట్ సేవలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. కిడ్నీ వ్యాధులపై జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నివేదిక రూపోందిస్తోందని.. అది రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. వైద్యారోగ్య రంగానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా అని మంత్రి సవాలు విసిరారు.