ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gulab Cyclone: తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం చేయండి: డిప్యూటీ సీఎం - గులాబ్

గులాబ్​(Gulab) తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ధర్మాన కృష్ణదాస్​ అప్రమత్తం చేశారు. సముద్రతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్రీకేష్‌ కోరారు.

మంత్రి కృష్ణదాస్
మంత్రి కృష్ణదాస్

By

Published : Sep 25, 2021, 10:05 PM IST

గులాబ్​(Gulab) తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. తపానుపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
సముద్రతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్‌ కోరారు. మత్స్యకారులు ఎవరూ చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్​ రూంలు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం కలెక్టరేట్‌లో ఉన్న కంట్రోల్ రూమ్ నెంబర్​ 08942-240557ను డయల్​ చేయాలని కలెక్టర్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details