ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

KODALI NANI: 'డీలర్ల బంద్ వల్ల పంపిణీ ఆగదు.. రేషన్ వాహనాల ద్వారానే పంపిణీ!'

డీలర్ల వల్ల రేషన్ పంపిణీ ఆగే ప్రసక్తే లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. నేరుగా రేషన్‌ వాహనాల ద్వారానే సరకులు పంపిణీ చేస్తామని తేల్చిచెప్పారు.

minister-kodali-nani-responds-on-rations-dealers-bandh
'డీలర్ల బంద్ వల్ల పంపిణీ ఆగదు.. రేషన్ వాహనాల ద్వారానే పంపిణీ!'

By

Published : Oct 27, 2021, 8:58 AM IST

'డీలర్ల బంద్ వల్ల పంపిణీ ఆగదు.. రేషన్ వాహనాల ద్వారానే పంపిణీ!'

రేషన్‌ డీలర్లు మాట వినకపోతే నేరుగా గోదాముల నుంచి వాహనాలకే సరకులు ఇచ్చి ప్రజల ఇళ్లవద్దకే సరఫరా చేయిస్తామని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సమీక్ష మండలి సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘గతంలో డీలర్ల ద్వారానే సరకులన్నీ ప్రజలకు అందేవి. ఇప్పుడు దాదాపు 11 వేల వాహనాలు సమకూర్చి వాటి ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే రేషన్‌ సరఫరా చేస్తున్నాం. డీలర్లు మేం ఇవ్వమంటే సరఫరా ఏమీ ఆగిపోదు. అవసరమైతే బైపాస్‌ చేసి వాహనాలకు నేరుగా పౌరసరఫరాలశాఖ నుంచి సరకులు అందించి ప్రజలకు సరఫరా చేయిస్తాం. డీలర్లకు ఏవైనా ఇబ్బందులుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి గాని ఇలా చేయడం సరికాదు. వారి తీరు, భాష మార్చుకోవాలి. ప్రజలకు నవంబరు ఒకటో తేదీ నుంచి సరకులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎవరు అడ్డుపడినా సరఫరా ఆగదు’ అని స్పష్టం చేశారు.

నిధుల సమస్యను అధిగమిస్తాం

‘చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా... 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ఖర్చు చేయాల్సిన నిధులకు కూడా ముందే టెండర్లు పిలిచేసి కొన్ని కార్యక్రమాలు చేసి బిల్లులు ఇవ్వకుండా వెళ్లిపోయారు. ఆ బిల్లులు ఆపకపోతే కొత్తగా పనులు చేసే పరిస్థితి లేదు కాబట్టి వాటిని ఆపాం. ఆ పాత బిల్లుల కోసం కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల ప్రకారం దాదాపు రూ.2 వేల కోట్ల పాతబిల్లులు వడ్డీలతో సహా చెల్లించాల్సి వచ్చింది. అందుకే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని అభివృద్ధి పనులకు నిధుల ఆటంకం వచ్చింది. వాటిని పరిష్కరించుకుంటూనే ముందుకెళ్తున్నాం’ అని నాని వెల్లడించారు.

ఇదీ చూడండి:

TIRUPATHI AIRPORT: ప్రైవేటుకు తిరుపతి ఎయిర్‌పోర్టు..తర్వాత విజయవాడ, రాజమహేంద్రవరం

ABOUT THE AUTHOR

...view details