ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఆసుపత్రులు పరిశీలించిన మంత్రి ధర్మాన - శ్రీకాకుళం కరోనా వార్తలు

శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్‌ ఆసుపత్రితో పాటు రాజాం జీఎమ్మార్ కేర్‌ ఆసుపత్రులను కరోనా బాధితుల కోసం అధికారులు కేటాయించారు. వాటిని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు. పాలకొండలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు.

minister dharmana
శ్రీకాకుళంలో కరోనా ఆసుపత్రులు సిద్ధం... పరిశీలించిన మంత్రి ధర్మాన

By

Published : Apr 3, 2020, 2:16 PM IST

శ్రీకాకుళంలో కరోనా ఆసుపత్రులు సిద్ధం... పరిశీలించిన మంత్రి ధర్మాన

కరోనా నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్‌ ఆసుపత్రితో పాటు రాజాం జీఎమ్మార్ కేర్‌ ఆసుపత్రులను కొవిడ్-19 బాధితుల కోసం సిద్ధం చేయగా.. అక్కడి సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. సౌకర్యాలు బాగా ఉన్నాయన్నారు. జిల్లాలో ఇంతవరకు ఒక్క కేసు నమోదు కాలేదన్న మంత్రి కృష్టదాస్‌.. దిల్లీ ప్రయాణం చేసిన వారి వివరాలు తీసుకుని పరిశీలించామని చెప్పారు. ప్రజలు అందరూ ఇళ్లలో ఉండాలన్న మంత్రి.. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details