ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేరుకే మూడు రాజధానులు.. పాలనంతా అక్కడి నుంచే: మంత్రి ధర్మాన - రౌండ్​ టేబుల్ సమావేశంలో ధర్మాన

MINISTER DHARMANA ON CAPITAL ISSUE : పేరుకు మూడు రాజధానులని చెప్పినా, పాలనంతా విశాఖ నుంచే సాగుతుందని.. మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇన్నేళ్ల తర్వాత విశాఖపట్నానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని ఆ ప్రాంత ప్రజలకు సూచించారు. "మన విశాఖ - మన రాజధాని" పేరిట శ్రీకాకుళంలో నిర్వహించిన రౌండ్​ టేబుల్ సమావేశంలో ధర్మాన పాల్గొన్నారు.

MINISTER DHARMANA ON CAPITAL ISSUE
MINISTER DHARMANA ON CAPITAL ISSUE

By

Published : Oct 31, 2022, 6:58 PM IST

MINISTER DHARMANA ON THREE CAPITAL ISSUE : రాజధానిని అడ్డంపెట్టుకొని.. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల సిల్వర్ జూబ్లీహాల్‌లో స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన.. "మన విశాఖ-మన రాజధాని" పేరిట రౌండ్​ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 33 వేల ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అంగీకరించడం లేదన్న అక్కసుతోనే తమపై బురద జల్లుతున్నారని విమర్శించారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని వద్దని శ్రీకృష్ణ కమిటీ సూచించిందన్న ధర్మాన.. ఆ కమిటీ నివేదికను పక్కనపెట్టి.. చంద్రబాబు కమిటీతో ఎవరికీ తెలియకుండా అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు వికేంద్రీకరణ అనుసరిస్తున్నాయన్న మంత్రి.. విశాఖ రాజధానిపై ప్రజల్లో తీవ్రత తెలియాలనే ఉద్దేశంతో.. రాజీనామా అన్నానని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

పేరుకే మూడు రాజధానులు.. పాలనంతా అక్కడి నుంచే

ABOUT THE AUTHOR

...view details